మగువలకు నిరాశ..పెరిగిన బంగారం, భారీగా తగ్గిన వెండి ధరలు

-

బంగారం ఎంత విలువైన వస్తువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పెరిగి, రూ. 55, 960 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి, రూ. 51, 300 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1500 తగ్గి, రూ. 74,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news