అక్కినేని వారి పేర్ల వెనుక “నాగ” అనే రహస్యాన్ని చెప్పిన నాగార్జున..!

-

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు కుటుంబీకుల పేర్లలో కచ్చితంగా నాగా అనే పదం కలిసి ఉంటుంది. మరి అలా పెట్టడానికి గల కారణం ఏమిటి అనేది చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని నాగార్జున రివీల్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ప్రతిరోజు నాగ పాము కలలోకి వచ్చేదట. అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ అమ్మగారు పాలు పట్టిస్తూ ఉండగా.. పాము పిల్ల కనిపించిందట. దాంతో వాళ్ళ అమ్మగారు నాగేశ్వరరావు అని పేరు పెట్టారట.

ఆ తర్వాత అది అక్కినేని నాగేశ్వరరావు గారి పిల్లలకు నాగ అనే పదం కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు అని చైతన్యకి కూడా నాగ అనే పదం కలపమని.. నాగార్జున వాళ్ళ అమ్మగారు ప్రత్యేకంగా చెప్పారట. అందుకే చైతన్య కాస్త నాగ చైతన్య అయ్యాడు. నాగచైతన్య, నాగార్జున మాత్రమే కాదు నాగార్జున సోదరి నాగ సుశీల కూడా ఇలా ప్రత్యేకంగా పేరు జోడించబడింది. ఇలా వీళ్లంతా కూడా తమ పేర్లకు నాగ అనే పేరును జోడించారు. ఇకపోతే నాగార్జున విషయానికి వస్తే నాగార్జున ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి హోస్ట్ గా చేశారు. అయితే ఇప్పుడు వచ్చే సెవెన్ సీజన్ కి ఆయన తప్పుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తన సినిమాలలో బిజీగా ఉండిపోయారు నాగార్జున.

ఇక నాగచైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య.. వెంకట ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమాతో ఎలాంటి కమర్షియల్ హిట్ సాధిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news