పింపుల్స్‌ వల్ల ఏర్పడిన మచ్చలు, గుంతలుకు ఏదైనా చికిత్స ఉందా..?

-

ఇంటర్‌కు రాగానే..బాడీలో చాలా మార్పులు జరుగుతుంటాయి.. అప్పుడే మొటిమలు బాగా వస్తాయి. అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలకు ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. అప్పుడు మొదలైన పింపుల్స్‌ ఇక వస్తూనే ఉంటాయి. మనం తినే ఆహారాన్ని బట్టి ఇవి కంట్రోల్లో ఉంటాయి.. పింపుల్స్‌ వచ్చిపోయినా వాటి తాలుకూ..మచ్చలు, గుంటలు మాత్రం అలానే ఉంటాయి.. వీటికి ఎన్ని క్రీమ్స్‌ వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా స్కిన్‌ పాడవుతుంది.. అసలు వీటికి ప్రత్యేకంగా ఏమైనా చికిత్సలు ఉంటాయా అని మీకు డౌట్‌ రావొచ్చు. అవును స్పెషల్‌గా పింపుల్స్‌ వల్ల ఏర్పడిన మచ్చలు, గుంటలు తొలగించటడానికి చికిత్సలు ఉన్నాయి.. అవేంటంటే.

ఈ మచ్చలు తొలగించుకోవడానికి చికిత్సలు ఉన్నాయి కానీ..కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. అలాగే కాస్త సమయం కూడా పడుతుంది. అందంగా మారాలని, గుంతలు పోవాలని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా వీటిని చేయించుకోవచ్చు. మొదటిది లేజర్ చికిత్స. ఈ లేజర్ చికిత్సలో భాగంగా గుంతలకు చుట్టుపక్కల ఉన్న చర్మాన్ని కొద్దిగా మార్పు చేస్తారు. అంటే ఆ ప్రదేశంలో గుంతలతో సమానంగా చుట్టుపక్కల ప్రదేశాన్ని కూడా చదునుగా చేస్తారు. అప్పుడు గుంతల లోతుతో పక్కనున్న చర్మం కూడా సమానంగా మారుతుంది. దీనివల్ల లోతు కనిపించదు..

కొన్ని లేజర్ చికిత్సల్లో గుంతల అడుగున ఉన్న కండరాల్లో కొలాజిన్ కుచించకపోయేలా చేస్తారు. దీంతో కోలాజిన్ పైకి లేచి గుంత లోతు లేకుండా ఉబ్బుతుంది. లేజర్ చికిత్సలు చేయడం వల్ల దాదాపు 30% గుంతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇది శాశ్వతమైన చికిత్స.. మళ్లీ మళ్లీ మీకు ఈ సమస్య రాదు.. అయితే ఈ లేజర్ చికిత్స ఒక్క సిట్టింగ్‌తో పూర్తవదు. కొందరికి ఏడని ఎనిమిది సార్లు వెళ్లాల్సి వస్తుంది. వారి చెంపలపై ఉన్న గుంతల లోతును బట్టి ఎన్నిసార్లు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందో వైద్యులు చెప్తారు..ధర కూడా మీ సమస్యను బట్టి ఉంటుంది.

గుంతలను తగ్గించేందుకు మరో అధునాతన చికిత్స అందుబాటులో ఉంది. అది నానో ఫాట్ గ్రాఫ్టింగ్ చికిత్స. ఇందులో భాగంగా ఆ వ్యక్తుల శరీరంలోని కొవ్వుని తీసి, ద్రవంగా మార్చి గుంతల కిందకు సూదులతో ఇంజక్ట్ చేస్తారు. ఇది గుంతల అడుగున ఉన్న కొలాజన్‌ను కుచించకపోయేలా చేసి ఉబ్బేలా చేస్తుంది. ఈ చికిత్సను ఒక్కసారి చేస్తే చాలు.. దాదాపు గుంతలు మాయం అవుతాయి. అయితే పూర్తిగా మాయం అవుతాయని చెప్పలేం. 50% వరకు గుంతలు తగ్గే అవకాశం ఉంది.

మరొక పద్ధతి కూడా అందుబాటులో ఉంది. అదే డెర్మబ్రేషన్ చికిత్స. ఇందులో ఒక పరికరంతో చర్మంపై పొరలను చెక్కుతారు.ఇది దాదాపు లేజర్ చికిత్స లాంటిదే.. అంటే చర్మం మొత్తాన్ని ఒక చదునుగా చేస్తారు. అప్పుడు గుంతలు కనబడవు. ఈ చికిత్స చేసుకున్నాక కోలుకోవడానికి కాస్త ఎక్కువే సమయం పడుతుంది. ఇంటి దగ్గరే ఉండాలి.

ఈ చికిత్సల్లో ఏది తీసుకోవాలో.. మీ గుంతల సైజును బట్టి, లోతును బట్టి ఆధారపడి ఉంటుంది. చర్మ వైద్యులను, కాస్మెటిక్ సర్జన్లను సంప్రదించాకే మీరు ఏ చికిత్స తీసుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే..మాత్రం తప్పక చేయించుకోవచ్చు..ఎందుకంటే.. ముఖం అనేది మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక..మీకు మీరు అందంగా నచ్చినప్పుడు నలుగురిలో భయం లేకుండా మాట్లాడగలుగుతారు. లేదంటే.. బయటకు వెళ్లాలంటే భయపడతారు. పైగా అందరూ ఏదో ఒక ఉచిత సలహా ఇస్తుంటారు.! ఏమంటారు..?

Read more RELATED
Recommended to you

Latest news