“వినరో భాగ్యము విష్ణు కథ” టీజర్ రిలీజ్..అదరగొట్టిన కిరణ్ అబ్బవరం

-

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అటు ఈ మూవీ చేస్తూనే మరో మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు ఈ యంగ్ హీరో.

అయితే.. ఇటీవల కిరణ్ అబ్బవరం మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్టును అనౌన్స్‌ చేశారు. అంతేకాదు.. “వినరో భాగ్యము విష్ణు కథ” అనే టైటిల్‌ ను కూడా ప్రకటించేశారు. “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా కు బన్నీ వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమా కు శరత్‌ చంద్ర నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఇక టీజర్‌ లో కిరణ్ అబ్బవరం….దుమ్ములేపేశాడు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news