కృతి సనన్ వేసుకున్న డ్రెస్​ అంత కాస్ట్లీనా..?

-

వన్​ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచేయ్ సినిమా చేసి తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది. దోచెయ్ తర్వాత కృతి బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.
 
హిందీ చిత్ర పరిశ్రమలో హీరోపంతి సినిమాతో అడుగుపెట్టింది. ఆ మూవీలో టైగర్ ష్రాఫ్ తో కలిసి ఈ బ్యూటీ తెరంగేట్రం చేసింది. హీరోపంతి తెలుగులో పరుగు సినిమాకు రీమేక్.
మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది కృతి. ఆ తర్వాత వరుస అవకాశాలతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అక్షయ్ కుమార్ వంటి సీనియర్ హీరోలతో పాటు.. టైగర్, కార్తీక్, వరణ్ వంటి యంగ్ హీరోలతోనూ జతకట్టింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ డార్లింగ్ ప్రభాస్​తో ఆదిపురుష్​ సినిమా చేస్తోంది. ఈ పొడుగు కాళ్ల సుందరి తాజాగా తాను నటిస్తున్న బాలీవుడ్​ మూవీ షెహ్​జాదా ట్రైలర్​ లాంచ్​ ఈవెంట్​కు హాజరయ్యింది. ఆ వేడుకలో ఆమె వేసుకున్న డ్రెస్​ ధర సుమారు రూ.37000 అంట.

Read more RELATED
Recommended to you

Latest news