లవ్‌ లో పడ్డ కీర్తి సురేష్‌..13 ఏళ్లుగా రిలేషన్ !

-

మహానటిగా కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఈమె నటన చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. ఇక అంతే కాదు తన నటనతో పాత్రను పండించగల ప్రతిభ కేవలం కీర్తి సురేష్ లో మాత్రమే ఉందని చెప్పడంలో సందేహం లేదు.

అయితే, ఈ దక్షిణాది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్ తన బాల్య స్నేహితుడితో ప్రేమలో ఉందని, వీరిద్దరూ 13 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతడు ఒక వ్యాపారవేత్త అని,అతడికి కేరళలో రిసార్ట్ లు ఉన్నట్లు పేర్కొన్నాయి. నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news