Re-Release: మహేష్ బాబు ఒక్కడు కలెక్షన్స్ ఎంతంటే..?

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా కూడా రీ రిలీజ్ అయింది.. మహేష్ బాబు హీరోగా.. భూమిక హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించి మెప్పించిన చిత్రం ఒక్కడు. ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మళ్లీ విడుదలైన పోకిరి సినిమా నుంచీ ఈ రీ రిలీజ్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 7వ తేదీన దాదాపు 20 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఈ సినిమా క్రేజ్ తగ్గలేదని మరొకసారి నిరూపించుకుంది. ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. నైజాం – రూ.1.40 కోట్లు, సీడెడ్ – రూ.0.36 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.2.95 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.0.22 కోట్లు అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 3.17 కోట్ల షేర్ రాబట్టింది. అంటే కేవలం మూడు రోజుల్లోనే ఇంత వసూలు చేసింది అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జరగలేదు. ఓవర్సీస్ లో కూడా రిలీజ్ కాలేదు ఒకవేళ అక్కడ కూడా రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా డబుల్ కలెక్షన్స్ సాధించేది ఈ సినిమా.

మొత్తానికి అయితే రీ రిలీజ్ లో కూడా ఒక్కడు సినిమా తను స్ట్రాటజీ చూపించింది. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news