తమిళ్ నటుడితో ప్రేమాయణం నడుపుతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్..!

-

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కోలీవుడ్ నటుడు వినయ్ .. హీరోయిన్ విమల రామన్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు , మలయాళం, కన్నడ భాషల్లో కథానాయకుడిగా నటించిన ఈయన ప్రస్తుతం విలన్ గా పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాగే నటి విమల రామన్ కూడా హీరోయిన్గా పలు భాషలలో నటించింది తెలుగులో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా, చట్టం, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, గాయం 2 తో వంటి సినిమాలలో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈమె.. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి మిస్ ఇండియా, మిస్ ఆస్ట్రేలియా పోటీల్లో టైటిల్ గెలుచుకుంది.

ఆ తర్వాత మోడల్ రంగంలోకి ప్రవేశించిన విమల రామన్ ను దర్శకుడు కే. బాలచందర్ పొయ్ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తర్వాత చేరన్ దర్శకత్వంలో రామన్ తేడియా సీతై చిత్రాలలో నటించి ఆ తర్వాత మాలివుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం భాష లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఏడాది వినయ్ తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా జరుపుకోగా.. ఆ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు వినయ్ కూడా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు.. వినయ్ తో కలిసి దిగి న ఫోటోలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news