“నా లైఫ్ లో ఉన్న రెండు కలలు నెరవేరింది… హీరో అదిత్ అరుణ్

-

శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో ‘ప్రేమదేశం’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంటులో ఈ సినిమాకి సంబంధించిన టీమ్ హాజరయ్యారు. కాగా, హీరో అదిత్ అరుణ్మాట్లాడుతూ… శిరీష నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహించాడు. “నా జీవితంలోకి శ్రీకాంత్ సిద్ధం అనే వ్యక్తి వచ్చాడు. ఇంతవరకూ సినిమా చేయలేదనీ .. తీయలేదని చెప్పాడు. నాతో సినిమా చేస్తానంటూ ఒక కథ చెప్పాడు. తనే ఈ సినిమాకి దర్శకుడు .. నిర్మాత కూడా” అన్నాడు. “నా లైఫ్ లో నాకు రెండే రెండు కలలు ఉన్నాయి.

Thrigun News - Latest News and Updates about Thrigun

వర్మగారి సినిమాలో నటించాలి .. మణిశర్మ మ్యూజిక్ చేసిన సినిమాలో నటించాలి అని. ఆ రెండూ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ మధుబాలతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాను తప్పకుండా హిట్ చేస్తారని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఏ మాత్రం కంటెంట్ బాగున్నా భారీ విజయాన్ని అందుకుంటూనే ఉంటాయి. అలాంటి కంటెంట్ తో రూపొందిన సినిమానే ‘ప్రేమదేశం’.ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. మేఘ ఆకాశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో మధుబాల ఒక కీలకమైన పాత్రను పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news