అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2023 నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు.. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పరీక్ష దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆగస్టు 1 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలని తెలిపింది.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష మే 28న జరగనుంది. పరీక్షకు కొద్ది వారాల ముందే ఈ-అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నారు.