Business idea : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందే బిజినెస్ ఇదే..

-

స్ట్రీట్ ఫుడ్ లలో పానీ పూరి బాగా ఫెమస్..ఎలా చేస్తారో తెలియదు కానీ రుచి మాత్రం అదిరిపోతుంది.. ఇక పానీపూరీ ఇష్టపడని వారు ఉండరు.చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు పానీ పూరీని తినడానికి ఇష్టపడుతున్నారు. అందుకే పానీపూరీకి డిమాండ్ బాగా ఉంది. కాబట్టి మీరు గనక పానీ పూరి బిజినెస్ చేస్తే అధిక లాభాలను పొందవచ్చు. శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఉండదు. టార్గెట్ ఉండదు. పైగా పానీ పూరి బిజినెస్ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10 అయినా జనాలు వస్తూనే ఉంటారు. షాపింగ్ మాల్స్ పక్కన, రద్దీగా ఉండే ప్రదేశాలలో అయితే సందు ఉండదు. బారులు తీరి ఉంటారు.

ఈ బిజినెస్ చేస్తే త్వరగా లాభాలను పొందవచ్చు. పానీ పూరి చేయడానికి ఇప్పుడు మార్కెట్ లో ఆటోమేటిక్ మిషన్లు ఉన్నాయి. ఇవి గంటకి ఐదు వేల పానీ పూరీలను చేస్తాయి. వీటి ధర 35 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. చిన్న మిషన్లు అయితే 25 వేల నుంచి 40 వేల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మేకింగ్ మిషన్ తో పాటు పానీపూరి మిషన్ కూడా కావాల్సి ఉంటుంది. ఇది పానీ పూరి నీరు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కౌంటర్ తో పాటు కలిపి వస్తుంది.ఈ ధర 35 వేల వరకు ఉంటుంది. ఈ మిషన్లు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇక పానీపూరిని సరైన ప్లేసులో పెట్టారంటే గంటకి 800 నుంచి 1000 వరకు సంపాదించవచ్చు.. ఇలా రోజులో కష్ట పడితే మీరు దగ్గరదగ్గర 10 వేల వరకు సంపాదించవచ్చు.

ఇందులో షాప్ రెంట్, కరెంట్ బిల్, జిఎస్టి, ముడి పదార్థాలకు పెట్టిన ఖర్చులు అన్నీ తీసేస్తే 2000 అయినా లాభం ఉంటుంది. నెలకు 60,000 వరకు సంపాదించవచ్చు. ప్రస్తుతం ఆహారాన్ని శుభ్రంగా తినాలని కోరుకుంటున్నారు. చేతికి గ్లౌజులు వేసుకుని చేతులతో టచ్ చేయకుండా మిషన్ల ద్వారా చేసిన ఫుడ్ ను ఇష్టపడుతున్నారు. మిషన్ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువమందికి సర్వ్ చేయవచ్చు.. ఈ బిజినెస్ చేసి నష్ట పోయినవారు లేరు.. అంతగా బిజినెస్ క్లిక్ అయ్యింది.. మీకు ఆలోచన ఉంటే మీరు చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news