నిన్న ఉదయం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు. 2023-24 ఏడాదికి రూ.2,90,395 కోట్ల బడ్జెట్ ను ఆయన ప్రవేశ పెట్టారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది, తెలంగాణ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు హరీష్ రావు. అలాగే రైతులకు కూడా హరీష్ రావు శుభవార్త చెప్పారు.
రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..రూ. 6385 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.90 వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల అప్పును మాఫీ చేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. అలాగే 2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు హరీష్ రావు. అలాగే, బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, విద్యుత్ రంగం 12, 727 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. దళిత బంధుకు ఏకంగా రూ. 17, 700 కోట్లను బడ్జెట్ లో ప్రవేశ పెట్టారు మంత్రి హరీష్ రావు.