CPI, CPMలతో పొత్తు ఉండబోతోందన్నారు BRS కీలక నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని.. ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
హంగ్ వస్తుందని కోమటిరెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంచి మెజారిటీతో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ క్రమం లోనే టికెట్ల కేటాయింపులో సర్వేల ప్రకారమే సీఎం కేసీఆర్ నిర్ణయం ఉండొచ్చని గుత్తా అభి ప్రాయం వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తుకు అవకాశ మే లేదని స్పష్టం చేశారు. వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావిస్తున్నానన్నారు. బిజెపి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ప్రజలు వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు మొత్తం కెసిఆర్ చేతి లో మాత్రమే సురక్షితంగా ఉంటుందని తెలిపారు. బిజెపి నేతలు దండుపాళ్యం బ్యాచ్ లా తయారయ్యారని విమర్శించారు.