మీ ఆధార్‌ లో సమస్యలా..? ఏఐ ఛాట్‌బాట్‌లో తెలుసుకోండి ఇలా..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. అలానే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఓపెన్ ఏఐ ఛాట్‌జీపీటీ ట్రెండింగ్‌ లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోతుండటం తో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ఉపయోగించుతోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తో పనిచేసే ‘ఆధార్ మిత్ర’ సర్వీస్ ని కొత్తగా తీసుకు వచ్చారు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… సందేహాలు ఉన్నా లేదంటే ఎలాంటి సమస్యలు అయినా వున్నా ఆధార్ మిత్ర ఛాట్‌బాట్‌ లో తెలుసుకోవచ్చు. మరి ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఇప్పుడు సందేహాలు, ప్రశ్నలు కి ఆధార్ మిత్ర ద్వారా సమాచారాన్ని పొందొచ్చు.

ఆధార్ మిత్ర ఏఐ ఛాట్‌బాట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంది. ఆధార్ మిత్ర ఏఐ ఛాట్‌బాట్‌లో మీరు మీకు దగ్గర లో వుండే ఆధార్ సెంటర్ వివరాలు ని కూడా తెలుసుకోవచ్చు. ఇక మరి ఇప్పుడు ఈ సర్వీస్ ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా చూసేద్దాం.

దీని కోసం మీరు ముందుగా https://www.uidai.gov.in/en/ వెబ్‌సైట్ ని ఓపెన్ చేయాలి.
ఆ తరవాత కుడి వైపు కింద ఆధార్ మిత్ర బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్సు మీద క్లిక్ చేయాలి.
తర్వాత GET STARTED పైన నొక్కండి.
PVC Status, Locate PEC, E-Aadhaar, Lost Aadhaar, Aadhaar Status ఆప్షన్స్ డిఫాల్ట్‌గా ఉంటాయి. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
లేదంటే మీకు ఏదైనా ప్రశ్న, సందేహం, ఫిర్యాదు ఉంటే టైప్ చేసి ఎంటర్ చేసేయండి.
మీకు సమాధానం వస్తుంది. ఆధార్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే 1947 నెంబర్‌కు డైల్ చేసి కంప్లైంట్ చెయ్యచ్చు. లేదంటే [email protected] మెయిల్ ఐడీ కూడా కంప్లైంట్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news