అప్పటి వరకు యుద్ధం ఆపం.. తేల్చిచెప్పిన పుతిన్‌

-

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యాలు చేశారు. పశ్చిమ దేశాలు.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసినంత కాలం యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్‌ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. వాటికి దీటుగా స్పందిస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఉక్రెయిన్‌లో పర్యటించిన ఒకరోజు తర్వాత పుతిన్.. రష్యా పార్లమెంట్‌ను ఉద్దేశించి మంగళవారం ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రసంగించిన పుతిన్‌.. ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలే కారణమని తేల్చి చెప్పారు. తాము సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని.. కానీ అవతలి వైపు నుంచి సానుకూలత కనపడడం లేదని పుతిన్‌ విమర్శించారు.

Vladimir Putin planning a coup in this country? US says 'deeply concerned'  | World News - Hindustan Times

తాము ఉక్రెయిన్ ప్రజలకు వ్యతిరేకం కాదన్న పుతిన్‌.. కీవ్‌లో నియంతృత్వ పాలన సాగుతోందుని ఆరోపించారు. పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్‌.. కీలుబొమ్మలా మారిందని మండిపడ్డారు. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే కాదన్న పుతిన్‌.. అమెరికా సహా మిత్రదేశాలు ఈ యుద్ధంలో ఏదో రకంగా పాల్గొంటున్నాయని దుయ్యబట్టారు.”యుద్ధభూమిలో రష్యాను ఓడించడం సాధ్యం కాదు. అందుకే పాశ్చాత్య దేశాలు.. రష్యా సంస్కృతి, సంప్రదాయాలపై అసత్య ప్రచారాలతో విషం గక్కుతున్నాయి. మేము ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే.. పాశ్చాత్య దేశాలకు ఆధిపత్యం కోసం యత్నిస్తున్నాయి. యుద్ధాన్ని వారు మొదలుపెట్టారు. మేము దానిని అంతం చేయడానికి కృషి చేస్తున్నాము.” అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news