పోలీసులు బాధ్యత మరిచి జగన్‌కు ఊడిగం చేస్తున్నారు : చంద్రబాబు

-

ఏపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిన్న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కారుకు నిప్పుపెట్టడం.. టీడీపీ నేతల అరెస్టుతో రాజకీయ భగ్గుమంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం ప్రవర్తిస్తుంటే.. పోలీసులు బాధ్యత మరిచి జగన్ కు ఊడిగం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గన్నవరం దాడులు జగన్ మనస్తత్వానికి నిదర్శనమన్నారు చంద్రబాబు. ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండడంతోనే ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడులతో భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు చంద్రబాబు.

No 'hanky panky' in projects initiated with previous govt: Chandrababu  Naidu | Mint

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ (TDP) నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు (Graduate MLC Elections).. పార్టీ ఇన్‌చార్జ్లు, నేతల పనితీరుకు పరీక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు. శాసనమండలి రద్దుకు తీర్మానం చేసిన జగన్కు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదు లేదన్నారు చంద్రబాబు. మండలి దండగ.. ప్రజా ప్రయోజనం లేదన్న జగన్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? అని ప్రశ్నించారు. తీవ్ర అసహనంలో ఉన్న జగన్ హింసకు దిగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news