నేడు తిరుమల శ్రీవాణి ఆన్‌లైన్ కోటా టికెట్ల విడుదల

-

తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవాణి ఆన్లైన్ కోట దర్శన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు గాను ఆన్లైన్ కోట టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.

రోజుకు 500 చొప్పున ఆన్లైన్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. https://tirupatibalaji.ap.gov.in/ వెబ్సైట్ నుంచి శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి సూచించింది. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుంచి మాత్రమే) ఉంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news