ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన ప్రమాదం

-

బీఆర్‌ఎస్ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కీసర రింగ్ రోడ్డుపై అకస్మాత్తుగా కుక్కలు అడ్డు రావడంతో ముందు వెళ్తున్న వాహనదారుడు సడెన్ బ్రేక్ వేశాడు. ఆ వెనకాల ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఉన్న వాహనం ముందు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. బుధవారం ఉదయం కీసరలో ఓ కార్యక్రమానికి హాజరైన సుభాష్ రెడ్డి.. అక్కడ నుంచి ఉప్పల్ తిరిగి వస్తుండగా కుషాయిగూడ సమీపంలో కీసర రింగ్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

mla bethi subhash reddy car accident, Uppal: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం.. కుక్కలు అడ్డు రావడంతో! - narrow escape for uppal brs mla bethi subhash reddy from road ...

ఎమ్మెల్యే వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసి కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం నుంచి తాను సురక్షితంగా ఉన్నానని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన కాన్వాయ్‌లోని రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news