ప్రీతి సూసైడ్ కేసు.. సైఫ్ కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ

-

వరంగల్ కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో.. సీనియర్ ర్యాగింగ్ వేధింపుల కారణంగానే ప్రీతి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు సైఫ్‌ను కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. సైఫ్‌ను 4 రోజుల కస్టడీకి పోలీసులు కోరగా.. వరంగల్ కోర్టు దీనికి అనుమతినిచ్చింది.

ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి.. చివరకు ఆదివారం కన్నుమూసింది. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి పీజీ చదువుకునేందుకు హాస్టల్‌లో ఉండేది. వైద్యవిద్యను అభ్యసిస్తున్న ప్రీతి పట్ల సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ మొదటి నుంచి కోపాన్ని ప్రదర్శించేవాడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో కళాశాలలో చేరిన నాటి నుంచి నిందితుడు సైఫ్‌తో ప్రీతికి రోజూ ఇబ్బందులేనని సమాచారం. డిసెంబర్ 6న రోగికి అవసరమైన ఊపిరి తీసుకునే పైప్ ఎందుకు తీసుకురాలేందంటూ ప్రశ్నించడంతో… ప్రీతి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.

తండ్రికి చెప్పగా.. ఆయన ఏసీపీ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఇక గ్రూపుల్లో ఎలాంటి సందేశాలు పెట్టొద్దని కళాశాల ప్రిన్సిపల్, హెచ్‌వోడీ సైఫ్‌ని హెచ్చరించినా తీరు మారలేదని తెలుస్తోంది. ఎవరికి చెప్పినా సైఫ్ పై చర్యలు తీసుకోకపోవడమే గాక వేధింపులు ఎక్కువ కావడంతో మనస్థాపం చెందిన ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news