9ఏళ్ల చిన్నారిపై కుక్క దాడి.. కర్రలతో కొట్టిచంపిన స్థానికులు

-

రాష్ట్రంలో కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో నాలుగేళ్ల బాలుడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల స్వైర విహారంపై అధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వీధికుక్కల దాడులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలకు ఉపక్రమించారు.

అయినా కుక్కల దాడులు మాత్రం ఆగడం లేదు. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. ఆ ఘటన మరవకముందే ఇవాళ జనగామ జిల్లాలోని ప్రెస్టన్ స్కూల్ పరిధిలో ఐదుగురిపై వీధి కుక్క దాడికి దిగింది. ఈ దాడిలో పూర్ణ అనే తొమ్మిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఐదుగురిపై దాడికి తెగబడ్డ కుక్కను స్థానికులు కర్రతో కొట్టి చంపారు.

వీధి కుక్కల స్వైర విహారం ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చామని.. అయినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మరోసారి పిల్లలపై కుక్కలు దాడి చేశాయని చెప్పారు. వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే కుక్కను కొట్టి చంపినట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news