రోజూ ఈ మూడు వ్యాయామాలు వేస్తే…ఎంతటి వేలాడే పొట్ట ఉన్న కరిగిపోతుంది..!!

-

అధిక బ‌రువు స‌మస్య ఈరోజుల్లో అందిరికీ ఉంటుంది.. బరువు ఎక్కువగా లేకపోయినా పొట్ట మాత్రం కామన్‌గా ఉంటుంది.. కుర్చోనే చేసే ఉద్యోగాలు.. ఆఫీసుల్లో గంటల తరబడి అలానే కుర్చోని కంప్యూటర్‌ ఒత్తుకుంటారు. తెలియకుండానే పొట్ట పెరుగుతుంది. ఆఖరికి ఒకరోజు అనుకుంటారు.. ఈ మధ్య పొట్టు వస్తుంది తగ్గించాలి అని.. మీరు పొట్ట తగ్గించుకోవాలంటే.. పెద్దగా కష్టపడకుండా ఈ మూడు వ్యాయామాలు చేయండి చాలు.. ఎంతటి వేలాడే పొట్ట అయినా వెన్నలా కరిగిపోతుంది.. నేల‌పై వెల్ల‌కిలా ప‌డుకోవాలి. చేతుల‌ను వీపు కింద పెట్టాలి. కాళ్ల‌ను ద‌గ్గ‌ర‌గా చేసి నిలువుగా పైకి లేపి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ భంగిమ‌లో 5 సెక‌న్ల పాటు ఉండండి.. త‌రువాత కాళ్ల‌ను కొద్దిగా కింద‌కు వంచాలి. 60 డిగ్రీల కోణంలో పెట్టాలి. మ‌ళ్లీ ఈ భంగిమ‌లోనూ 5 సెక‌న్ల పాటు ఉండండి.. అనంత‌రం కాళ్ల‌ను ఇంకాస్త కొద్దిగా కింద‌కు వంచాలి. ఇప్పుడు 30 డిగ్రీల కోణంలో కాళ్ల‌ను పెట్టాలి. మ‌ళ్లీ 5 సెక‌న్ల పాటు ఉండాలి. ఇలా చేశాక కాళ్ల‌ను కింద‌కు దించి య‌థావిధిగా నేల‌పై ఉంచాలి..

ఈ వ్యాయామాన్ని 5 నిమిషాల పాటు చేయండి… మొదట్లో కాస్త కష్టంగానే అనిపిస్తుంది..రోజూ చేస్తుంటే అల‌వాటు అవుతుంది. దీంతో ఎక్కువ సార్లు చేయ‌గ‌లుగుతారు. వీలుంటే స‌మ‌యాన్ని పెంచుతూ పోవాలి. రోజూ క‌నీసం 10 నిమిషాల పాటు ఈ వ్యాయామాన్ని చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ వ్యాయామం వ‌ల్ల పొత్తి క‌డుపుపై ఒత్తిడి బాగా ప‌డుతుంది. అక్క‌డి కండ‌రాల్లో క‌ద‌లిక వ‌స్తుంది. ఆ భాగంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు.. ఈ వ్యాయామంలో కాళ్ల‌ను 60 డిగ్రీల కోణంలో ఉంచిన‌ప్పుడు వాటిని ద‌గ్గ‌ర‌గా పెట్టి గాల్లోనే సైకిల్ తొక్కిన‌ట్లు తొక్కాలి. 5 సెక‌న్ల నుంచి 10 సెక‌న్ల పాటు చేశాక కాళ్ల‌ను కింద‌కు దించాలి. మ‌ళ్లీ కాళ్ల‌ను పైకి లేపి అలాగే చేయాలి. ఒక్కో కాలుతోనూ దీన్ని చేయ‌వ‌చ్చు. ఈ వ్యాయామాన్ని 5 నిమిషాల పాటు చేయాలి. క‌ష్టంగా ఉంద‌నుకుంటే ఆరంభంలో 2-3 నిమిషాలు చేయండి. త‌రువాత స‌మ‌యాన్ని పెంచుతూ పోవాలి. క‌నీసం రోజుకు 10 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.

ఈ వ్యాయామంలో నేలపై వెల్ల‌కిలా ప‌డుకుని చేతుల‌ను వీపు కింద ఉంచాలి. అనంత‌రం కాళ్ల‌ను కొద్దిగా పైకి లేపి 60 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ భంగిమ‌లో కాళ్ల‌ను ద‌గ్గ‌ర‌గా పెట్టి వాటిని ఒకేసారి గుండ్రంగా చ‌క్రం తిప్పిన‌ట్లు తిప్పాలి. ముందుగా కుడివైపు నుంచి ఎడ‌మ‌కు త‌రువాత ఎడ‌మ వైపు నుంచి కుడివైపుకు కాళ్ల‌ను తిప్పాలి. ఇలా 5 సెక‌న్ల పాటు చేయాలి. దీన్ని 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వ‌ర‌కు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ వ్యాయామం వ‌ల్ల కూడా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది.

రోజూ ఈ 3 వ్యాయామాలను 5 నిమిషాల‌కు ఒక‌టి చొప్పున క‌నీసం 15 నిమిషాల పాటు చేయాలి. దీంతో ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది. పొట్ట భాగం అందంగా మారుతుంది. పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు అధికంగా ఉన్న‌వారు ఈ మూడు వ్యాయామాల‌ను రోజూ త‌ప్ప‌క చేయాల్సి ఉంటుంది. దీంతో నెల రోజుల్లోనే ఫ‌లితం క‌నిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news