రోజు 11 నిమిషాలు స్వీడ్‌గా నడిస్తే.. ఆయుష్షు పెంచుకోవచ్చట..!

-

ఈరోజుల్లో చాలామంది గుండెజబ్బులతో వయసుతో సంబంధం లేకుండా చనిపోతున్నారు. అప్పటి వరకూ బానే ఉంటున్నారు.. సడన్‌గా గుండెనొప్పితో కుప్పకూలి పోతున్నారు. మీకు ఇలాంటి పరిస్థితి రావొద్దంటే.. బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలి. తినేవి, తాగేవి అన్నీ మంచిగా ఉండేలా చూసుకోవాలి. రోజూ వాకింగ్‌ చేస్తే.. ఆరోగ్యానికి మంచిదని అంటారు. కానీ మనకు అంత టైమ్‌ ఉండదు. రోజు కేవలం 11 నిమిషాలు చురుకైన నడక మీ ఆయుష్షును పెంచుతుంది తెలుసా..?

ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం 11 నిమిషాల చురుకైన నడక మీ ఆయుష్షును పెంచుతుందని తేలింది.. రోజుకు 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం వల్ల మీరు ఎక్కువ కాలం జీవించవచ్చు. ప్రతి ఉదయం చురుకైన నడక గుండె సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాదు, చురుకైన నడక అనేక క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది సహజంగా ఆయుష్షును పెంచుతుంది.

చురుకైన నడక కోసం నిపుణులు కొన్ని మార్గదర్శకాలను కూడా ఇచ్చారు. రోజూ ఈ బ్రిస్క్ వాక్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇటీవల, ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య చాలా పెరిగింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణించారు. మరో గణాంకాల ప్రకారం, క్యాన్సర్ మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. 2017లో ప్రపంచవ్యాప్తంగా 9.6 మిలియన్ల మంది రోగులు క్యాన్సర్‌తో మరణించారు. కరోనా తర్వాత గుండెసమస్యలతో చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆయాసం, గుండె దడ, ఆందోళనతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏ వస్తువుకైనా మనం గ్యారెంటీ ఇవ్వగలం కానీ..మనిషి ప్రాణానికి మాత్రం ఎలాంటి గ్యారెంటీ లేదు.. కాబట్టి మన చేతుల్లో ఉన్న పని కేవలం ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండటమే.. రోజూ కేవలం 11 నిమిషాలు స్పీడ్‌గా నడిస్తే.. మంచిదంటే.. చేసేద్దాం.. పోయేదేముంది..?

Read more RELATED
Recommended to you

Latest news