మొత్తానికి వంగవీటి రాధా మరోసారి పార్టీ మార్పుపై పరోక్షంగా సంకేతం ఇచ్చేశారు. ఆయన టిడిపిలోనే కొనసాగనున్నారని..తాజాగా లోకేష్ తో భేటీ అయ్యాక అర్ధమైంది. తాజాగా లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో జరుగుతున్న లోకేష్ పాదయాత్రకు వంగవీటి రాధా మద్ధతు ఇచ్చారు. లోకేష్ తో కాసేపు ముచ్చటించి..పాదయాత్రలో పాల్గొన్నారు. దీని ద్వారా ఆయన టిడిపిలో ఉంటారని తేలిపోయింది.
గత ఎన్నికల ముందే ఆయన వైసీపీ నుంచి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు గాని..టిడిపికి ప్రచారం చేశారు. టిడిపి ఓడిపోయి అధికారం కోల్పోయాక కాస్త రాజకీయాలకు దూరం జరిగారు. కానీ ఎప్పటికప్పుడు టిడిపికి మద్ధతుగా ఉంటూనే ఉన్నారు..వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలని అప్పుడప్పుడు రంగా విగ్రహావిష్కరణ సమయంలో కలుస్తున్న..వారు వైసీపీలోకి రావాలని కోరుతున్నా సరే రాధా మాత్రం టిడిపిని వదలడం లేదు. ఇక టిడిపి నేతలపై ఆఫీసులపై దాడులు జరిగినప్పుడు టిడిపికి మద్ధతుగా ఉంటున్నారు. అటు అమరావతి రైతులకు అండగా ఉంటున్నారు.
అయితే తాజాగా ఆయన జనసేనలోకి వెళ్లడానికి రెడీ అయ్యారని, మార్చి 14 జనసేన ఆవిర్భావ సభ సమయంలో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతూ వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఆయన పార్టీ మారతానని చెప్పలేదు. ఇలా ప్రచారం నడుస్తుండగానే..ఆయన లోకేష్ పాదయాత్రలో కలిసి సఘీభావం తెలిపారు. దీని బట్టి చూస్తే ఆయన టిడిపిలోనే ఉంటారని తెలుస్తోంది.
ఇంకా ఆయన పార్టీ మారే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇంకా ఆయన సీటు విషయంలో క్లారిటీ లేదు.