టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఓకే ఎమోషనల్ పోస్టును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు ఈ హీరో.. టాలీవుడ్ లో తన టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. 2003లో వచ్చిన ఐదో తారీకు చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఈ హీరో. అనంతరం శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఒక చిన్న పాత్రలో మెరిసారు. గౌరీ, సంక్రాంతి, లక్ష్మీ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించారు. అనంతరం 2006లో వచ్చిన అమ్మ చెప్పింది సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. గమ్యం, ప్రస్థానం వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా 2017 లో వచ్చిన ప్రస్థానం సినిమా శర్వానంద్ కెరీర్ను మలుపు తిప్పింది అనే చెప్పాలి. ఈ సినిమా మంచి హిట్గా నిలవడంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు ఈ హీరో..
శర్వానంద్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎంటర్టైన్ చిత్రాలు నటించి మెప్పించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాన్ని అలవాటు చేసుకున్న ఈ హీరో తాజాగా ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులు, ప్రేక్షకులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెబుతూ ఒకే ఎమోషనల్ పోస్ట్ ను ఉంచారు.
ఈ పోస్ట్ లో శర్వానంద్… ‘20 ఏళ్లు ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందర్నీ అలరిస్తున్నాను. భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోతులు, చిరునవ్వులు ఎన్నో మెరెన్నో, అచంచలమైన ప్రేమ మరియు మద్దతుతో నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి. నా ఈ ‘ఓకే ఒక జీవితం’ సినిమాకి అంకితం. 20 సంవత్సరాల కింద ‘శ్రీకారం’ చుట్టిన ఈ సినీ ‘ప్రస్థానం’ మరుపురానిది, మరువలేనిది. ఈ సినీ లోకం లో నా ‘గవ్యం’ ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం ‘రన్ రాజా రన్’లా పరుగులు తీస్తూనే ఉంటాను. క్రుషి చేస్తూనే ఉంటాను. ‘శతమానం భవతి’ అంటూ మీరు నాకు ఇచ్చే ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను.. ‘ అంటూ రాస్కొచ్చారు.