పబ్లిక్ లో ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియోతో అడ్డంగా బుక్..

-

ప్రజల్లోకి రాజకీయ నేతలు వెళ్ళినప్పుడు వారి దృష్టిని ఎలా ఆకర్శించాలి అని ఆలోచించాలి.. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం మహిళా నేతకు ముద్దులిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు..ఇక నెటిజన్స్ ట్రోల్స్ కు గురయ్యాడు.. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే ప్రకాష్‌ సర్వే చిక్కుల్లో పడ్డారు. దహిసర్‌లో ఆశీర్వాద్ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నేతను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది..

ఇందుకు సంబందించిన వీడియో ఒకటి బయటకు రావడంతో అసలు మ్యాటర్ బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎమ్మెల్యే బుగ్గ మీద.. పార్టీ అధికార ప్రతినిధి షీతల్‌ మహత్రే ముద్దాడినట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ర్యాలీకి శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, పార్టీ అధికార ప్రతినిధి శీతల్ మహత్రే హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్‌తో పాటే ఆమె కూడా వాహనం మీద ఉన్నారు. ఆయన పక్కనే నిలబడి ఉన్న షీతల్‌ మహత్రే ఉన్నట్టుండి ఎమ్మెల్యే వైపు తిరిగింది. ఆ సమయంలో రెండుసార్లు కిందకు వంగిన ఎమ్మెల్యేను మహిళా నేత ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపించింది..

ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో ఫేక్‌ అని తేల్చారు. తన పరువు తీసేందుకు, రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీడియోను మార్ఫింగ్‌ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేగాక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు..ఈ వ్యవహారంపై శీతల్ మహత్రే స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా అని ఆమె ద్వజమేత్తారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news