అసలు పవన్ కల్యాణ్ వల్ల తమకు నష్టం లేదని..పవన్ టిడిపితో కలిసొచ్చినా సరే..ఇంకెంతమందితో కలిసొచ్చినా తమకు పోయేదేమీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. పైగా కాపు వర్గం పవన్ కంటే జగన్‌కే మద్ధతు ఇస్తున్నారని చెబుతున్నారు. అంటే పవన్ వల్ల వైసీపీకి అసలు నష్టం లేదనేది వైసీపీ కాన్సెప్ట్. అయితే ఇదంతా పైకి చెప్పేది. కానీ గ్రౌండ్ రియాలిటీకి వెళితే పవన్ వల్ల ఖచ్చితంగా వైసీపీకి నష్టం ఉంది..అందులో ఎలాంటి డౌట్ లేదు. పవన్ గాని టిడిపితో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి డ్యామేజ్ ఖాయం.
అందుకే పవన్‌ని దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ నేతలు సవాళ్ళు చేస్తున్నారు. అంటే జనసేన అన్నీ స్థానాల్లో పోటీ చేస్తే ఎక్కడకక్కడ ఓట్లు చీల్చి టిడిపికి నష్టం వైసీపీకి లాభం జరుగుతుంది. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇప్పుడు పవన్ టిడిపితో కలవకపోతే తమకే లాభమనే కాన్సెప్ట్ లో వైసీపీ ఉంది. అంటే టిడిపితో పొత్తు ఉంటే జనసేనకు అన్నీ స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉండదు. కొన్ని సీట్లే వస్తాయి. ఇక పొత్తు ఉంటే వైసీపీకి మైనస్.
దీంతోనే 175 స్థానాల్లో పోటీ చేయాలని పవన్‌ని రెచ్చగొడుతున్నారు. కానీ పవన్ అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని చెప్పడానికి వైసీపీ నేతలు ఎవరు అని అంటున్నారు. ఇక వైసీపీ ఏదైతే జరగకూడదని అనుకుంటుందో అదే జరుగుతుందని చెబుతున్న విషయం తెలిసిందే.
అంటే వైసీపీ..టిడిపి-జనసేన పొత్తు ఉండకూడదు అని కోరుకుంటుంది..కానీ అది జరగదని..పొత్తు ఉంటుందనేది పవన్ చెబుతున్నారు. ఇక పొత్తు ఉంటే మాత్రం డౌట్ లేకుండా వైసీపీకి నష్టం మాత్రం గ్యారెంటీ ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందనేది ఎన్నికల సమయంలో తెలుస్తుంది.