AP Budget 2023-24 : వ్యవసాయ శాఖకు రూ. 11589.48 కోట్లు

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన వ్యవసాయ రంగానికి రూ. 11589.48 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. ఈ సూక్తిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తు.చ తప్పకుండా పాటిస్తోందని స్పష్టం చేశారు.

బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి ప్రసంగిస్తూ.. ‘నాలుగేళ్లలో ఆర్థిక శాఖ ఫ్యామిలీలా పని చేశాం. నాలుగేళ్లు సహకరించిన ఆర్థిక శాఖాధికారులకు ధన్యవాదాలు. పేదల పట్ల, ప్రజల పట్ల సీఎంకు ఉన్న బాధ్యత, ప్రేమతో నాలుగో ఏడాది బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాను.’ అని చెప్పారు.

సెకండరీ ఎడ్యుకేషన్‌- రూ. 29,690.71 కోట్లు, వైద్యారోగ్య శాఖ- రూ. 15,882.34 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి- రూ. 15,873 కోట్లు, ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్‌ అండ్‌ బీ- రూ. 9,118.71 కోట్లు, విద్యుత్ శాఖ- రూ. 6546.21 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news