ఇండియన్ రైల్వేస్ నుండి ‘రామాయణ యాత్ర’ ప్రారంభం…ఈ 18 రోజుల యాత్ర వివరాలు ఇవే..!

-

ఇండియన్ రైల్వేస్ రామాయణ యాత్ర ని ప్రారంభించింది. దీనిలో భాగంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇక పూర్తి వివరాలని చూసేస్తే.. ఏప్రిల్ 7 నుంచి ‘రామాయణ యాత్ర’ ని ప్రారంభం చేయనున్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ ట్రైన్ లో ప్రయాణం చెయ్యాల్సి వుంది. తెలంగాణలోని భద్రాచలం మీదుగా ఇది వెళ్తుంది.

18 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. అయోధ్య, వారణాసి, హంపి, భద్రాచలం, రామేశ్వరం వంటి ఆలయాలని చూసి వచ్చేయచ్చు. అయోధ్య, నందిగ్రామ్, సీతామర్హి, బక్సార్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, శృంగవేరిపురం, చిత్రకూట్, నాశిక్, హంపి, రామేశ్వరం, భద్రాచలం, నాగ్‌పూర్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. రామజన్మభూమి, రామమందిర చూడచ్చు.

సరయు నదీ హారతిని కూడా చూడచ్చు. నందిగ్రామ్‌ లోని భరత మందిరం, సీతామర్హి లోని జానకి మందిరం, జనకపురిలోని జానకీ రామ మందిరం ఇవన్నీ చూసేయచ్చు. ఇలా ఎన్నో ప్రాంతాలు కవర్ అవుతాయి. వీటిని అన్ని కూడా చూడచ్చు. మొత్తం 156 మంది టూరిస్టులు ట్రావెల్ చేసేయచ్చు. సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషనులో రైలు ఎక్కవచ్చు. ఘజియాబాద్, అలీఘర్, టండ్లా, ఎతవాహ్, కాన్పూర్, లక్నోలో బోర్డింగ్ చెయ్యచ్చు. ఒక్కొక్కరికి రూ.1లక్షకు పైగా ఖర్చు అవుతుంది. సదుపాయాలు అయితే బాగున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news