TikTok కి బాగా అడిక్ట్ అయిన వారిలో ముందు వరుసలో భారతీయులే ఉన్నారు. భారత్ లో ముఖ్యంగా చెన్నై వాసులు TikTok కి కట్టుబానిసలుగా మారిపోయారని కూడా నివేదికలు చెప్తున్నాయి. ఇప్పటి వరకూ TikTok వల్ల ఆత్మహత్యలు కానీ, కుటుంభ కలహాలు, దారుణాలు అత్యధిక శాతం చోటు చేసుకున్నవి కేవలం చెన్నైలోనే. TikTok పై చెన్నై లో నిషేధం విధించాలని ఎన్నో వినతులు ప్రభుత్వానికి వెళ్తున్నాయి కూడా. కానీ రోజు రోజుకి TikTok కి బానిసలుగా మారిపోతూ తీవ్రంగా నష్టపోతున్నవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ సంఘటన వింటే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే.
చెన్నైకి చెందిన వినిత అనే మహిళ TikTok వీడియోలు తరుచూ చేస్తూ ఉంటుంది. తన భర్త ఆరోకియా సింగపూర్ లో పని చేస్తూ ఉంటారు. దాంతో ఆమె ఒంటరిగా ఉండటంతో TikTok వీడియోలు ఎక్కువగా చెయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆమెకి TikTok లో తిరువనంతపురం కి చెందిన అభి అనే అమ్మాయి పరిచయం అయ్యింది. క్రమ క్రమంగా వారి స్నేహం ప్రేమకి దారి తీసింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి నెలకొంది.
వినిత తన చేతిపై అభి అనే పచ్చబొట్టు వేసుకుని వీడియోలు చేయగా అది చూసిన భర్త తన భార్య ఒక అమ్మాయితో సంభంధం పెట్టుకుందని తెలిసి సింగపూర్ నుంచీ తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇంట్లో అతడికి 10 కాసుల బంగారం కనిపించలేదు. అయితే బంగారం ఏమయ్యిందని భర్త అడిగినా ఆమె స్పందిచక పోవడంతో ఆమెని చెన్నైలోనే ఆమె తల్లి తండ్రుల వద్దకి పంపేశాడు. ఈ క్రమంలోనే ఆమె 15 కాసుల బంగారాన్ని తన తల్లి తండ్రుల ఇంట్లోంచి కాజేసి పారిపోయింది. ఈ విషయంపై పోలీసులని ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.