TSPSC పేపర్ లీకేజ్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్కు నివేదిక ఇచ్చాం.. సీఎం ఆదేశాలతో సమీక్ష నిర్వహించామని వివరించారు మంత్రి కేటీఆర్. ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని సీఎం తెలిపారన్నారు మంత్రి కేటీఆర్.
గత ఎనిమిదేళ్లలో TSPSCలో ఎన్నో సంస్కరణలు చేపట్టామని.. ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించాని గుర్తు చేశారు. యూపీఎస్సీ చైర్మన్ రెండు సార్లు వచ్చి మన సంస్కరణలను అధ్యయనం చేశారని వెల్లడించారు మంత్రి కేటీఆర్. వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఎంతో మందిని బాధపెడుతోందన్నారు.
రద్దు అయిన నాలుగు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. కోచింగ్ మెటీరియల్ ఉచితంగా ఆన్లైన్లో అందుబాటులో పెడతామన్నారు. స్టడీ సెంటర్లో 24 గంటలు రీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచుతాం, ఉచిత భోజన వసతి కల్పిస్తామని చెప్పారు మంత్రి కే టీఆర్.