సినిమా బాగా తీయలేదు.. దసరా దర్శకుడిపై నాని ఫైర్

-

నేచురల్ స్టార్ నాని-కీర్తి సురేశ్​ కలిసి నటించిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, బొగ్గు గనుల ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొదించారు. పాన్​ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రబృందం.

అయితే తాజాగా దసరా దర్శకుడిపై హీరో నాని ఫైర్ అయ్యారు. దసరా సినిమా అనుకున్నంత బాగా రాలేదని అన్నారు. అసలేం జరిగిందంటే..  తాజాగా దసరా మూవీటీమ్​ తెలుగు బుల్లితెర షో ‘సుమ అడ్డా’లో సందడి చేసింది. ఈ షోలో నాని సరదాగా క్రికెట్​ ఆడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే సుమ.. నానిని పలు ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగింది.

‘మీకు మీ వైఫ్ కన్నా మీ అబ్బాయే ఎక్కువ  ఇష్టం’ అని అడగగా.. అవును, కాదు అంటూ రెండు సమాధానాలు చెప్పారు నాని.  ‘తెలుగు ఇండస్ట్రీలో మీకు పోటీనిచ్చే హీరో లేడు’, ‘దర్శకుడు  శ్రీకాంత్ ఓదెల గురించి చెప్పండి’ అని అడగగా.. వీటికి తనదైన స్టైల్​లో నాని షాకింగ్​ ఆన్సర్స్​​ ఇచ్చారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news