మోడీ నిరంకుశ చర్యలకు ఇది నిదర్శనం :వైఎస్‌ షర్మిల

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మోదీ అనే ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించగా, పార్లమెంటు ఆయనపై అనర్హత వేటు వేయడంపై స్పందించారు . కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని వెల్లడించారు షర్మిల. విపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదని బీజేపీ పై తన ఆగ్రహం వ్యక్తం చేసారు షర్మిల.

Delhi police detain YS Sharmila protesting against Telangana's KCR govt |  Watch | Mint

వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని వ్యక్తపరిచారు ఆమె. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని వ్యక్తపరిచారు ఆమె. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై అణచివేత తగదని పేర్కొన్నారు.
రాజకీయ వైరుధ్యాల కంటే రాజ్యాంగ విలువలు చాలా గొప్పవని, పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు షర్మిల. సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలన్నా, రాసుకున్న రాజ్యాంగం అమలు కావాలన్నా ఈ నిరంకుశ నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని తెలిపారు షర్మిల.

 

 

Read more RELATED
Recommended to you

Latest news