రూ.99 ఖర్చు చేస్తే.. రూ.10,000 లాభం..?

-

ఆధునిక కాలంలో ఫ్యామిలీ బడ్జెట్ లో ఎక్కువ శాతం ఆక్రమించేవి.. విద్య, వైద్యం.. రోగం వచ్చి ఒక్కరోజు ఆసుపత్రిలో ఉన్నా.. ఖర్చు వేలల్లో ఉంటోంది. అందులోనూ పల్లె, పట్నం అన్నతేడా లేకుండా రోగాలు విజృంభిస్తున్నాయి. అందులోనూ దోమల కారణంగా వచ్చే డెంగీ జ్వరాలు, మలేరియా, చికున్ గన్యా వస్తే ఇక అంతే సంగతులు.

కానీ ఇప్పుడు వీటన్నిటి నుంచి సింపుల్ గా కేవలం ఓ 100 రూపాయలతో బయటపడవచ్చు. ఎందుకంటే.. దోమల వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికున్ గన్యా లాంటి వ్యాధులకు కూడా బీమా ఇస్తున్నాయి ఇప్పుడు కొన్ని పేమెంట్ బ్యాంకులు. అవును మరి ఇందుకు ఖర్చెంతో తెలుసా..కేవలం రూ. 99 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ , ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంయుక్తంగా ఈ వెరైటీ పాలసీని అందుబాటులోకి తెచ్చాయి.

మరి ఈ బీమా పొందడం ఎలా.. అంటారా.. సింపుల్.. ఈ బీమా సౌకర్యం పొందాలంటే ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతాదారులై ఉండాలి. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు సంవత్సరానికి కేవలం 99 రూపాయల ప్రీమియం చెల్లించి ఈ పాలసీని పొందవచ్చు. ఈ పాలసీ వలన దోమకాటుతో సంభవించే ఏడు రకాల వ్యాధులకు పరిహారం పొందొచ్చు. ఈ బీమా పొందటానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదని సులువుగానే ఈ బీమా సౌకర్యం పొందవచ్చు.

చికున్ గన్యా, మలేరియా, డెంగీ, మెదడువాపు, కాలా ఆజార్, బోదకాలు, జికా వైరస్ వ్యాధులకు ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ వ్యాధుల బారిన పడి ఒకరోజు ఆస్పత్రిలో ఉంటే గరిష్ఠంగా 10,000 రూపాయల వరకు పరిహారం అందిస్తారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకులో 40 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. ఖాతాదారులను పెంచుకునే క్రమంలో ఈ వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చారు.

ఈ బీమా ద్వారా దోమకాటు బారిన పడి ఆస్పత్రిలో ఉన్నవారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. ని తెలుస్తోంది. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా లేని వారు ఖాతా ఓపెన్ చేసి ఈ సేవలను పొందవచ్చు. పేదలకు, మధ్య తరగతి వర్గాలకు ఈ పాలసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news