ఈ భూప్రపంచంలో మనకి తెలియని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించింది. ఆ జలాశయం పేరు భీంకుండ్. ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్ పూర్ జిల్లాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రత్యేకత ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే పెరిగిపోతాయి.
దాంతో ఎపుడైతే సడెన్ గా ఈ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందో స్థానికులు త్వరలోనే ఏదో ఆపద ముంచుకు రానుందని జ్యోస్యం చెప్పేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జ్యోస్యం 100కి 100 పాళ్ళు చాలాసార్లు నిజమైంది. ఈ జలాశయానికి సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం సాధారణంగా చెరువుల్లో, బావుల్లో, జలాశయాలలో గనక ఎవరైనా మునిగి చనిపోతే కొన్ని రోజులకు వారి శరీరం ఉబ్బి పైకి తేలుతుంది. కానీ ఈ జలాశయంలో ఎవరైనా మునిగిచనిపోయారో ఇక వారి శవం అడ్రస్ ఆ దేవుడికే తెలియాలి.
మరొక ఆశ్చర్యకరమైన విషయంఏంటంటే ఎన్నో అడ్వాన్సెడ్ ఎక్విప్ మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ జలాశయం లోతు మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈ జలాశయంలోని నీరు సముద్రపు నీటిలాగా బ్లూకలర్ లో వుండి ట్రాన్సపరెంట్ గా క్లిస్టర్ క్లియర్ గా ఉంటుంది. ఈ జలాశయంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని,సర్వపాపాలు నశిస్తాయని,ఈ నీరు మాలయాపర్వతప్రాంతాలలోని పవిత్రగంగా జలంతో సమానమని కొంతమంది బలంగా నమ్ముతున్నారు.
ఈ జలాశయం రహస్యం తెలుసుకోవటానికి డిస్కవరీ ఛానల్ టీంసభ్యులు రంగంలోకి దిగారు. భారత మిలటరీ విభాగానికి చెందిన గజ ఈతగాళ్ళు సైతం క్రిందికి దిగారు. కానీ ఈ మిస్టరీని చేధించలేక చేతులెత్తేశారు.