చరణ్ కు చిరంజీవి బర్త్ డే విషెస్.. కిస్ ఇచ్చి మరి

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అయితే ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే. రామ్ చరణ్ 38 సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కు… టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు మెగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ తరుణంలోనే రామ్ చరణ్ కు… ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. గర్వంగా ఉంది నాన్న అంటూ ట్విట్ చేస్తూ రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు రాంచరణ్ కు కిస్ ఇస్తూ.. దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తండ్రి కొడుకుల మధ్య… ఎంత మంచి ప్రేమ ఉందో అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోను చూస్తే అందరికీ దిష్టి తగులుతుంది అంటూ కూడా కొంతమంది అంటున్నారు. కాగా రాంచరణ్ – శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news