నాగచైతన్య కొత్త ఇల్లు ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

-

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తనకు నచ్చినట్టు అన్ని సదుపాయాలతో ఉన్న ఇంటిని కొన్న నాగచైతన్య ఖర్చు విషయంలో అసలు వెనక్కి తగ్గలేనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయగా దీని ఖరీదు తెలిసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.

అక్కినేని నాగచైతన్య తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొత్త ఇల్లు కొని అందులోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అత్యంత విలాసవంతంగా ఉన్న ఈ ఇంటిని చై తన అభిరుచికి తగినట్టు కట్టించుకుంటూనే అత్యంత లగ్జరీగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కుటుంబానికి దగ్గరగా ఉండటానికి తన ఇంటికి దగ్గరగానే ఈ ఇంటిని కొన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విలాసవంతమైన ఇంటి కోసం నాగచైతన్య దాదాపు 20 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం..

Naga Chaitanya Wiki, Biography, Age, Family, Movies List, Images - News ...

ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొస్తూ తనకు ఒంటరిగా ఉండటమే ఇష్టం అంటూ తెలిపిన సంగతి తెలిసిందే. సమంతతో వివాహానికి ముందు కూడా హైదరాబాదులో ఓ ఇంట్లో కుటుంబానికి దూరంగా ఉండేవారు. ఒంటరిగా ఉంటే ఎన్నో విషయాలు అర్థమవుతాయని చెప్పుకొచ్చిన నాగచైతన్య సమంతతో పెళ్లి అనంతరం జూబ్లీహిల్స్ లో ఉండేవారు. విడాకులు అనంతరం ఆ ఇంటిని వదిలేసిన చైతన్య తండ్రితో పాటు ఉన్నారు. ప్రస్తుతం కొత్త ఇంటిని తీసుకొని అందులోకి అడుగు పెట్టారు. కాగా ఈ మధ్యనే “థాంక్యూ”, “లాల్ సింగ్ చద్దా” సినిమాలతో వరుసగా రెండు డిజాస్టర్లు అందుకున్న నాగచైతన్య త్వరలోనే “కస్టడీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభ్ దర్శకత్వంలో తెలుగు తమిళ్ బై లింగువల్ సినిమాగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news