నిఖిల్ క్రేజ్ ను మరింత పెంచేందుకు రెడీ అవుతున్న పెద్ద ప్రాజెక్టులు…

-

ఒక ప్రాజెక్టు కాంట్రాక్టు పై ఆక్టర్ నిఖిల్ సైన్ చేస్తే, ఇక ఆ రోజు నుండి ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన దర్శకులతో, నిర్మాతలతో తన ప్రయాణం కొనసాగిస్తాడు. నిఖిల్ ఎప్పటికప్పుడు బెటర్మెంట్ తీసుకురావడానికి తనవంతు కృషి తాను చేస్తూనే ఉంటాడు . ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా స్థాయిలో విఘాన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిఖిల్ కెరియర్లోనే 100 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఈ నేపథ్యంలోనే నిఖిల్ తో ‘స్వామి రారా 2’ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా దర్శకుడు సుధీర్ వర్మ ఉన్నాట్లు తెలుస్తుంది.

Karthikeya 2 earns Rs 100 crore at box office, Nikhil details why film  worked in Hindi markets | Regional-cinema News – India TV

‘స్వామి రారా’ సినిమాకి అప్పట్లో యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిఖిల్ కి ‘కార్తికేయ 2’తో వచ్చిన క్రేజ్ వలన, ‘స్వామి రారా 2’ను కూడా పట్టాలెక్కించాలని సుధీర్ వర్మ భావిస్తున్నాడు. కథా చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పాడు.
ఈ నేపథ్యంలోనే ‘కార్తికేయ 3’ చేయడానికి దర్శకుడు చందూ మొండేటి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన కథపైనే కసరత్తు చేస్తున్నాడని సంచరం. అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పుడు నిఖిల్ చేస్తున్న సినిమాలు కాకుండా, మరో రెండు పెద్ద ప్రాజెక్టులు కూడా నిఖిల్ కి లైన్ లో ఉన్నాయ్.

 

Read more RELATED
Recommended to you

Latest news