భద్రాచలం వెళ్లనందుకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే !

-

దేశవ్యాప్తంగా నిన్న శ్రీరామనవమిని పురస్కరించుకుని రాములవారి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో వెలసిన శ్రీరాముల ఆలయంలోనూ వేడుకలు జరిగాయి. అయితే ప్రతి ఏడాది తెలంగాణ సీఎం కేసీఆర్ సీతారాముల కల్యాణానికి వెళ్లి అధికారికంగా పట్టువస్త్రాలు మరియు తలంబ్రాలు ఇస్తూ ఉండడం సంప్రదాయంగా వస్తోంది. కానీ నిన్న మాత్రం సీఎం కేసీఆర్ భద్రాచలం వెళ్లకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సీఎం చేసిన పొరపాటుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ అడుగుతోంది.

ఇది హిందూ సంప్రదాయాలను కించపరచడమే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాకుండా గతంలో భద్రాచలం అభివృద్ధి కొరకు 100 కోట్లు ఇస్తాన్న హామీ గురించి సీఎం మరిచారా అంటూ ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ గుర్తు చేసింది. ఎందుకు కేసీఆర్ భద్రాచలానికి అన్యాయం చేస్తున్నారని తమ ఆవేదనను వెలిబుచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news