కర్ణాటకలో మే వ తేదీ నుండి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఎన్నికలకు ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన కర్ణాటకకు ప్రధాని మోదీ బీజేపీ తరపున ప్రచారం చేయడానికి విచ్చేస్తున్నారు. బీజేపీ కర్ణాటక నాయకులు బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా మళ్ళీ కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇక అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటకకు రానున్నారు.
రాహుల్ గాంధీ కూడా అదే రోజు జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని తన వాణి బీజేపీకి వ్యతిరేకంగా వినిపించనున్నారు. మరి అప్పటి పొలిటికల్ హీట్ ఏ విధంగా ఉండనుందో ? ఎలక్షన్ మీద వీరిద్దరి పర్యటన ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.