బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అంటే వణుకు పుడుతోంది : ఎంపీ అరవింద్‌

-

నేడు తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులను నిజామాబాద్ ఎంపీ అరవింద్ పరామర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ని ఖండిస్తూ బీజేపీ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి పంపగా అతడి కుటుంబ సభ్యులను ఆదివారం ఎంపీ అరవింద్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అంటే వణుకు పుడుతోంది అని అందుకే కక్ష సాధింపుతో బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని ఎంపీ అరవింద్ విమర్శించారు. .

ఓటమి భయంతోనే బీజేపీ కార్యకర్తల పై కేసులు..ఎంపీ అరవింద్.. | Latest Telugu  News

2018కి ముందు ఉత్తర తెలంగాణ పసుపు రైతుల పక్షాన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రులను కలుస్తూ ముందుకు సాగిన నాయకుడు తిరుపతి రెడ్డి అని అంతే కాకుండా గతంలో ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ పై పోరాటం చేసిన రైతులపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని రాబోయే ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ సీటు బీజేపీ ఖాతాలో పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత లు బీజేపీ నాయకులపై కేసులు పెట్టమని పోలీసుల మీద ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news