కొత్త టాటూతో దర్శనమిచ్చిన విరాట్ కోహ్లీ…

-

తాజాగా ఐపీఎల్ సీజన్ లో కొత్త టాటూతో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇష్టపడే క్రికెటర్లలో విరాట్ కోహ్లీ దర్శనమిచ్చాడు. ఐపీఎల్ తాజా సీజన్ నేపథ్యంలో కోహ్లీ చేతిపై ఉన్న ఆ టాటూకు అర్థమేంటని చాలామందిలో ఆసక్తి రేగింది. ఈ టాటూను కోహ్లీ ఇటీవలే ఏలియన్స్ టాటూ స్టూడియో ఓనర్ సన్నీ భానుషాలితో వేయించుకున్నాడు. కోహ్లీ కొత్త టాటూపై సన్నీ భానుషాలి వివరణ ఇచ్చారు. తన ఆధ్యాత్మికతను సంపూర్ణంగా ప్రతిబింబించేలా టాటూ ఉండాలని కోహ్లీ కోరాడని, జీవితచక్రమం మొత్తం ఆ టాటూ ప్రతిఫలించాలని సూచించాడని తెలిపారు.

New tattoo on Kohli hand

కోహ్లీ మాటలను బట్టి, అతడి మనస్తత్వం ఆ టాటూలో ఉండాలని తనకు అర్థమైందని భానుషాలి వివరించారు. అందుకే, ఆ పచ్చబొట్టును అత్యంత కచ్చితత్వంతో వేసేందుకు ఎంతో కష్టపడినట్టు తెలిపారు. కోహ్లీకీ టాటూ వేసేటప్పుడు ఎవరూ రాకుండా స్టూడియోను మూసివేశామని, స్టూడియో చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కాగా, కోహ్లీ ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అని, తన పేరుప్రతిష్ఠలను కూడా పక్కనబెట్టి ఎంతో గౌరవపూర్వకంగా మాట్లాడాడని కొనియాడారు. కోహ్లీ కొన్నేళ్ల కిందటే తమ కార్యాలయానికి వచ్చాడని, తమ టాటూల ఫొటోలను చూపించి వాటి గురించి ప్రశంసించాడని భానుషాలి వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news