‘ సైరా వ‌ర్సెస్‌ చాణక్య‌ ‘ … గోపీచంద్ సంచ‌ల‌న కామెంట్‌

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం సైరా. అక్టోబ‌ర్ 2వ తేదీన ఏకంగా ఐదు భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై దేశ‌వ్యాప్తంగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ సినిమాకు పోటీ వెళ్లేందుకు కూడా ఎవ్వ‌రూ సాహ‌సం చేయ‌డం లేదు. మిగిలిన భాష‌ల్లోనే ప‌రిస్థితి ఇలా ఉంటే తెలుగులో మాత్రం మ‌రో యంగ్ హీరో సినిమాకు సైరాకు పోటీగా వ‌స్తోంది.

గోపీచంద్ కొత్త సినిమా చాణక్య అక్టోబర్ 5 న రిలీజ్ అవుతోందనే సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా మందికి షాక్ ఇచ్చింది. సైరా రిలీజ్ అయిన మూడో రోజునే చాణ‌క్య కూడా వ‌స్తోంది. గోపిచంద్ ఈమధ్య ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గోపీకి హిట్ త‌ప్ప‌నిస‌రి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో గోపీ మెగాస్టార్ సినిమాతో పోటీకి వెళ్ళడం అందరికీ షాక్ ఇచ్చింది. సైరాకు పాన్ ఇండియా సినిమాగా భ‌యంక‌రంగా ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. ఇక ఈ క్లాష్‌పై గోపీచంద్ క్లారిటీ ఇచ్చాడు. తాము చాణ‌క్య‌ను ద‌స‌రాకే రిలీజ్ చేయాల‌ని అనుకున్నామ‌ని… సైరా రిలీజ్ డేట్ ఆ త‌ర్వాత ఎనౌన్స్ చేయ‌డంతో త‌మ‌కు ఆప్ష‌న్ లేద‌ని చెప్పాడు.

ద‌స‌రాకు ఉన్న ఎడ్వాంటేజ్ వ‌దులుకోకూడ‌ద‌నే త‌మ సినిమాను అనుకున్న డేట్‌కే తెస్తున్నామ‌ని చెప్పాడు. దసరా సీజన్ హాలిడేస్ కాబట్టి రెండు సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బంది లేక‌పోయినా గోపీ మాత్రం భారీ రిస్కే చేస్తున్నాడు. ఈ సినిమాకు త‌మిళ్ డైరెక్ట‌ర్ తిరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా… గోపీ స‌ర‌స‌న మెహ్రీన్ హీరోయిన్‌.

Read more RELATED
Recommended to you

Latest news