BIG BREAKING: తెలంగాణ విద్యాశాఖామంత్రి రాజీనామా చెయ్యాలని NSUI డిమాండ్

-

తెలంగాణ విద్యాశాఖలో ఎందుకు ఈ పొరపాట్లు జరుగుతున్నాయి. మొన్నకు మొన్న గ్రూప్ 1 TSPSC పేపర్ లీక్ అవ్వడం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఈ రోజు ఉదయం టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్ష స్టార్ట్ అయిన కొద్ది సేపటికే తెలుగు పేపర్ వాట్సాప్ గ్రూప్ లలో ప్రత్యక్షము అయింది . ఈ విషయం మధ్యాహ్నం నుండి తెగ వైరల్ అవుతోంది. తెలిసిన సమాచారం ప్రకారం ఈ పేపర్ లీక్ కు కారణం అయిన ముగ్గురిని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

 

అయినా అంతటితో ప్రతిపక్షాలు ఊరకే వదిలేస్తాయా ? ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు సబితా ఇంద్రారెడ్డిని రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తుండగా, తాజాగా విద్యార్థి సంఘాలు ఈ పేపర్ లీక్ ఘటనపై భగ్గుమంటున్నాయి. మరియు అబిడ్స్ లోని SSC బోర్డు కార్యాలయం ఎదుట NSUI ధర్నాకు దిగారు. ఈ ఘటనపై సత్వరమే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ లీక్ కు బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్యాశాఖామంత్రి రాజీనామా చెయ్యాలని నిరసనలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news