ఐపీఎల్ లో ఈ రోజు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జయింట్స్ ల మధ్యన మ్యాచ్ జరగనుంది. రెండు టీం లు గెలుపే ప్రధాన లక్ష్యంగా మైదానంలోకి అడుగుపెట్టనున్నాయి. అయితే మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైన చెన్నై మాత్రం ఒత్తిడిలో ఉంటుందని చెప్పాలి. ఇక మొదటి మ్యాచ్ లో గెలిచిన ఉత్సాహంతో రెండవ మ్యాచ్ లో మరింత ఫ్రీ గా రాహుల్ సేన ఆడే అవకాశం ఉంది. కాగా మొదట టాస్ గెలిచిన లక్నో సూపర్ జయింట్స్ జట్టు కెప్టెన్ రాహుల్ ఫిల్డింగ్ ఎంచుకున్నాడు.
ఈ పిచ్ మీద ఛేజింగ్ చేయడం చాలా కష్టం అని ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ లు చెబుతున్నాయి. ఇక్కడ మొదటి బ్యాటింగ్ చేసే జట్టు 170 పరుగులు చేస్తే డిపెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రౌండ్ లో బ్యాట్స్మన్ పరుగులు చేయడానికి చెమటోడ్చక తప్పదు.