సాధారణంగా కష్టపడే తత్వం ప్రతిభ ఉన్నప్పటికీ ఒక్కోసారి అదృష్టం లేకపోతే అవకాశాలు అనేవి మనల్ని దరి చేరవు. అలా వందమందిలో కేవలం ఒకరిద్దరికీ మాత్రమే అదృష్టం వరిస్తుంది. మిగతా వాళ్లంతా తమ ప్రతిభతో ముందుకు నెట్టుకు రావాల్సిందే. అబ్బాయిలైతే తట్టుకోగలుగుతారు గాని అమ్మాయిలైతే ఇక ఇండస్ట్రీలో నరకం చవిచూడాల్సి ఉంటుంది. ఈ నరకాన్ని దాటి ఇప్పుడు ఎంతోమంది తమ కలలను సహకారం చేసుకున్నారు. అలాంటి వారిలో పల్సర్ బైక్ ఝాన్సీ కూడా ఒకరు.
ఒకవైపు బస్ కండక్టర్గా విధులు నిర్వర్తిస్తూనే.. ఎన్నో పాటలకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చింది. పల్సర్ బైక్ పాట మాత్రం ఆమె కెరియర్ నే మలుపు తిప్పేసిందని చెప్పాలి. ఈ పాటకు స్టేజ్ దద్దరిలేలా డాన్స్ చేయడంతో టీవీ షోలో డాన్స్ చేసే అవకాశాలు కూడా తనకు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక షోకి వచ్చిన ఝాన్సీ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ..” జనాలు చెబుతున్నట్టు నేనేమీ ఓవర్ నైట్ స్టార్ కాలేదు.. ఈ సక్సెస్ వెనుక నా 18 సంవత్సరాల కష్టం ఉంది.
ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టానష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో నా తండ్రి కూడా నాకు మద్దతు ఇవ్వలేదు. ఒకరోజు బట్టల కోసం కొలతలు ఇవ్వడానికి టైలర్ షాప్ కి వెళ్తే.. అతడు తప్పుడు ప్రవర్తనతో నన్ను ఇబ్బంది పెట్టాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఈ విషయం తండ్రికి చెప్పి కొట్టిద్దామని అనుకున్నాను.. కానీ మా నాన్న నేను నీ తండ్రిని కాదని చెప్పమని అన్నాడు” అంటూ కన్నీటి పర్యంతం అయింది ఝాన్సీ. తనలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు అని కూడా కోరుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె రంగస్వామి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.