వంటింట్లో పాలు కాచడం ఎంత పెద్ద పనో.. ప్రతి మహిళకు తెలుసు.. ఎంత జాగ్రత్తగా పాలుకాస్తున్నా.. అలా ఒక క్షణం అటు వెళ్లొచ్చే సరికి పొంగిపోతాయి.. పాలు పోవడం ఇక్కడ ఒక సమస్య అయితే.. మళ్లీ అందంతా క్లీన్ చేసుకోవాలి.. రెప్పపాటు కాలంలో ఈ పాలు ఇలా పొంగిపోతాయి.. మనం అక్కడ ఉన్నంత సేపు అస్సలు పొంగురావు.. ఇలా రాగానే ఎందుకు వస్తాయో అని మహిళలు అంతా చాలా ఇరిటేట్ అవుతారు.. మీరు చాలాసార్లు ఈ పరిస్థితిని ఎదుర్కోనే ఉంటారుకదా..! నూటికి 90 శాతం మంది ఇలాగే జరిగి ఉంటుంది.. ఇక మీకు ఆ సమస్య ఉండదు.. పాలు పోయ్యిమీద పెట్టి మీరు ఇన్‌స్టాలో రీల్స్ కూడా చేసేయొచ్చు.. కానీ పాలు మాత్రం పొంగవు. హ్యాపీగా మరిగుతాయి.. వెళ్లి ఆపేసుకోవచ్చు.. ఎలా అంటారా..? అందుకు ఒక చిన్న ట్రిక్ ఉంది. దాన్ని పాటిస్తే చాలు.. ఇకపై ఎప్పుడు పాలను మరిగించినా అవి పొంగి పోవు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.
పాలను స్టవ్ మీద పెట్టినప్పుడు గిన్నె మీద అడ్డంగా ఒక చెక్క గంటెను ఉంచండి. అంతే.. పాలు పొంగు దాకా వచ్చినా పొంగి పోవు. పైనే ఆగి ఉంటాయి. అందువల్ల మనం కావల్సినప్పుడు స్టవ్‌ను ఆఫ్ చేయవచ్చు. దీంతో పాలు పొంగి పోకుండా ఉంటాయి. ఇది చాలా సులభంగా పనిచేసే ట్రిక్. చెప్పారు బానే ఉంది కానీ.. ఎందుకు పొంగవు అనే కదా మీ డౌట్..
కింద మంట పెట్టినప్పుడు పాలపై ఒక పొరగా పైకి వస్తుంది. అలా వచ్చిన పొర గరిటెను తాకగానే ఆవిరితో కూడిన ఆ పొర పగిలిపోతుంది. చెక్క త్వరగా ఉష్ణాన్ని గ్రహించదు కాబట్టి అది త్వరగా వేడెక్కదు. అందుకే పాలు అక్కడి వరకు వచ్చి ఆగిపోతాయి. అంతే.. అందువల్ల పాలు పొంగు రావు. కాబట్టి ఇకపై పాలను మరిగిస్తే.. గిన్నెపై ఒక చెక్క గంటెను ఉంచడం మరిచిపోకండి. చాలా సులభంగా వర్కవుట్ అవుతుంది.. అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది.