తెలంగాణలో పదో తరగతి పరీక్షలకూ లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే తెలుగు క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఇవాళ హిందీ ప్రశ్నా పత్రం కూడా వాట్సాప్‌లో వైరల్ కావడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇవాళ హిందీ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ఆ పేపర్ వాట్సాప్‌లో వైరల్ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశ్నపత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులకు కూడా స్పష్టత లేదు.
హిందీ పేపర్ లీక్ కావడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ ఈ ఘటనపై స్పందించగా తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ ఘటనపై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పాలనను గాలికొదిలి.. రాజకీయ విధ్వంసంలో మునిగారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలన పట్టించుకోక పోవటం వల్లే ప్రశ్నపత్రాల లీకులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎస్‌ఎస్‌సీ మొదలు టీఎస్‌పీఎస్‌సీ వరకు కుప్పకూలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది విద్యార్థులతో సీఎం చెలగాటం ఆడుతున్నారని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక పరీక్షలు కాదు… రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
🔥కేసీఆర్ పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతో ప్రశ్నాపత్రం లీకులు…
🔥పదవ తరగతి మొదలు- టీఎస్‌పీఎస్‌సీ వరకు వ్యవస్థలన్నీ కుప్పకూలాయి..
🔥లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాడు…
🔥కేసీఆర్ కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు..
🔥ఇక… pic.twitter.com/KMZBIsRpal
— Revanth Reddy (@revanth_anumula) April 4, 2023