తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం కరీంనగర్ లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటి దగ్గరకు వెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్యన ఉదయాన కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం అమానుషం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున గోల చేస్తున్నా వినిపించుకొని పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం డీకే అరుణ బీజేపీ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజలకు మమ్మల్ని దూరం చేయలేరని మండిపడ్డారు.
కేసీఆర్ వెంటనే బండి సంజయ్ ను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ను ఎటువంటి కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అంతే కాకుండా కల్వకుంట్ల కుటుంబం పాలన వలన రోజు రోజుకి ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇకనైనా కల్వకుంట్ల కుటుంబ నిరంకుశ మరియు అరాచక పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.