గురకపెట్టి నిద్రపోతున్నారా..? గురక సమస్యను నయం చేసే చిట్కాలు ఇవే.!

-

నిద్రపోవడమే ఈ రోజుల్లో చాలామందికి పెద్ద సమస్యగా మారింది.. ఎలాగోలా నిద్రలోకి జారకుంటే.. అక్కడ మళ్లీ ఇంకో సమస్య.. ఇంజన్‌ స్టాట్‌ చేసినట్లు ఒకటే గురక. దాంతో.. పక్కన వాళ్లకు అస్సలు నిద్రే ఉండదు. అదొక్కటే సమస్య కాదు.. నిద్రలో ఇలా గురక పెడితే.. మీ ఆరోగ్యం కూడా గాడితప్పిందనే అర్థం.. గురక పెట్టకుండా ఇప్పుడు మార్కెట్‌లో ఏవేవో మెషిన్స్‌ కూడా వచ్చేశాయి. కొన్ని చిట్కాల‌ను పాటిస్తే గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే..

Is snoring always a sign of sleep apnea? - Harvard Health

 

గురక సమస్య నుంచి బయటపడాలంటే..

ఒక టీస్పూన్ తేనెలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల గుర‌క స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

వెల్లకిలా కాకుండా ఏదైనా ఒక వైపుకు తిరిగి పడుకుంటే గురక రాదు.

తలవైపు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా గురక రాకుండా ఆపుతుంది.

ప్రతి రోజూ రాత్రి నిద్రపోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్‌ అవుతుంది.

ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా యాలకుల పొడి కలిపి నిద్ర పోయే ముందు తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గురక సమస్య త‌గ్గుతుంది.

తేనెలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల‌ మంచి ఫలితం కనిపిస్తుంది.

రాత్రి పూట భోజనంలో పచ్చి ఉల్లిపాయను తినాలి. దీంట్లో ఉండే సల్ఫర్ యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో గురక సమస్య త‌గ్గుతుంది.

గోరువెచ్చని పాలలో ప‌సుపును వేసుకొని తాగడం వల్ల శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి. దీంతో గుర‌క స‌మ‌స్య త‌గ్గుతుంది.

ఇలా గుర‌క స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వీటిల్లో మీకు వీలైన చిట్కాను ఎంచుకోని ట్రై చేసి చూడండి.. ఎన్ని చేసినా ఫలితం లేదంటే.. అలానే గురకపెట్టి నిద్రపోకుండా.. వైద్యులను సంప్రదించండి.. నిజానికి గురక సమస్య ఎక్కువ రోజులు ఉంటే.. అది గుండెపైన ప్రభావం చూపుతుంది. ఎప్పుడు ఒత్తిడి ఎక్కువైతే గురక వస్తుంది కానీ.. రోజు అంటే సమస్యే..!

Read more RELATED
Recommended to you

Latest news