Breaking : ఈ నెల 8న బీఆర్‌ఎస్‌ ధర్నాలు

-

మరోసారి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే.. సింగ‌రేణి ప్రయివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగ‌రేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, కొత్త‌గూడెం, రామ‌గుండం ఏరియాల్లో మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. సింగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించ‌బోమ‌ని రామగుండంలో ప్ర‌ధాని మోదీ మాట ఇచ్చి త‌ప్పార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. లాభాల్లో ఉన్న సిగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అని ప్ర‌శ్నించారు.

 

Nagarjuna Sagar by-poll: KTR promises moon, invokes old-young analogyవేలం లేకుండా సింగ‌రేణికి బొగ్గు గ‌నులు కేటాయించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సంక‌ల్పాన్ని దెబ్బ‌తీసేందుకే కేంద్రం కుట్ర చేస్తుంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌కు సింగ‌రేణి ఓ ఆర్థిక‌, సామాజిక జీవ‌నాడి లాంటింద‌ని పేర్కొన్నారు. సింగ‌రేణి ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌కుంటే జంగ్ సైర‌న్ మోగిస్తాం.. మ‌రో ప్ర‌జా ఉద్య‌మం నిర్మిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news